తిరుమ‌ల‌లో అందుబాటులోకి బ్యాట‌రీ కార్లు… త్వ‌ర‌లో 100 బ‌స్సులు…

తిరుమ‌ల‌లో ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కోసం ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను ప్ర‌వేశ పెట్టేందుకు టీటీడీ సిద్ధం అయింది.  ఇందులో భాగంగా మొద‌టి ద‌శ‌లో టీటీడీ అధికారుల కోసం 35 బ్యాట‌రీ కార్ల‌ను ప్ర‌వేశ పెట్టింది.  వీటిని ఈరోజు తిరుమ‌ల‌కు తీసుకొచ్చారు.  బ్యాట‌రీ కారులోనే టీటీడీ ఛైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి తిరుమ‌ల‌కు వ‌చ్చారు.  ప్ర‌స్తుతం అధికారుల కోసం 35 బ్యాట‌రీ కార్లు అందుబాటులోకి తీసుకొచ్చామ‌ని చెప్పారు.  రెండు, మూడు ద‌శ‌ల్లో 100 ఎల‌క్ట్రిక్ ఆర్టీసీ బ‌స్సుల‌ను అందుబాటులోకి తీసుకొస్తామ‌ని తెలిపారు.  ప‌ర్యావ‌ర‌ణాన్ని ర‌క్షించాల్సిన బాధ్య‌త ప్ర‌తి ఒక్క‌రిపై ఉంద‌ని ఇందులో భాగంగానే ఎల‌క్ట్రిక్ వాహనాల‌ను అందుబాటులోకి తీసుకొస్తున్న‌ట్టు ఆయ‌న పేర్కొన్నారు. 

Read: క‌రోనా ఎఫెక్ట్‌: పైలెట్ కంటే… లారీ డ్రైవ‌ర్‌గానే అధిక సంపాద‌న‌…

-Advertisement-తిరుమ‌ల‌లో అందుబాటులోకి బ్యాట‌రీ కార్లు... త్వ‌ర‌లో 100 బ‌స్సులు...

Related Articles

Latest Articles