శ్రీవారి భక్తులకు శుభవార్త.. తెరుచుకున్న రెండు ఘాట్‌ రోడ్లు.. కానీ

గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏపీలో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. తిరుపతిలో మునుపెన్నడూ చూడన విధంగా వరదలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలు వరదల కారణంగా కొండచరియలు విరిగి ఘాట్‌ రోడ్డుపై పడిపోయాయి. అంతేకాకుండా మెట్టుమార్గంలో చెట్లు, వరద నీటితో అస్థవ్యస్థంగా తయారైంది. దీంతో ఘాట్‌ రోడ్డుపై రాకపోకలను అధికారులు నిలిపివేశారు.

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే…

తాజాగా వర్షం తగ్గుముఖం పట్టిన నేపథ్యంతో తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి విచ్చేస్తున్న భక్తులకు టీటీడీ గుడ్‌ న్యూస్‌ చెప్పంది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను రెండు ఘాట్‌ రోడ్ల ద్వారా అనుమతిస్తున్నట్లు తెలిపింది. అంతేకాకుండా తిరుమల కనుమ రహదారులు పునరుద్దరణ చేస్తున్నట్లు తెలిపింది. కానీ ద్విచక్రవానహనాలకు అనుమతి నిరాకరించినట్లు వెల్లడించింది.

టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నట్లు టీటీడీ తెలిపింది. శ్రీవారి మెట్టు, అలిపిరి రహదారులు మూసివేసినట్లు టీటీడీ పేర్కొంది. ఇప్పటికే భారీవర్షాలతో దెబ్బతిన్న శ్రీవారి మెట్టు పునరుద్దరణ పనులు టీటీడీ చేపట్టింది. త్వరలోనే కాలినడక మార్గం కూడా తెరుచుకుంటుందని భక్తులు ఆశిస్తున్నారు.

Related Articles

Latest Articles