తిరుపతి వాసులకు టీటీడీ గుడ్‌న్యూస్‌

తిరుమల, తిరుపతి వాసులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం… స్థానికంగా ఉండే భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోటాను పెంచింది టీటీడీ.. ఎమ్మేల్యే కరుణాకర్ రెడ్డి చొరవతో స్థానికులుకు వైకుంఠ ద్వారా దర్శనం టికెట్ల కోటా పెరిగింది.. ముందుగా రోజుకి 5 వేల చొప్పున మొత్తం 50 వేల మందికి దర్శన టికెట్లను కేటాయించాలని భావించింది టీటీడీ.. అయితే, ఎమ్మెల్యే కరుణాకర్‌ రెడ్డి చొరవతో ఆ సంఖ్య రెట్టింపు అయ్యింది.. రోజుకి 10 వేల చొప్పున మొత్తం లక్ష టికెట్లను స్థానికులకు వైకుంఠ ద్వారా దర్శనం కోసం కేటాయించేందుకు అంగీకరించింది టీటీడీ.

Read Also: మళ్లీ కరోనా టెన్షన్‌.. తెలంగాణ ఆరోగ్య శాఖ 9 కీలక సూచనలు

ఇక, ఈ నెల 9వ తేదీన లేదా 11వ తేదీన గానీ స్థానికులకు వైకుంఠ ద్వారా దర్శనం టికెట్లను కేటాయించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు.. వైకుంఠ ద్వారం ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి వీఐపీలు, వీవీఐపీల తాకిడికూడా పెరిగే అవకాశం ఉంది.. వైకుంఠ ద్వారా దర్శనానికి తిరుమల రానున్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ.. 12వ తేదీ తిరుమలకు చేరుకోనున్నారు సీజేఐ ఎన్వీరమణ దంపతులు.

Related Articles

Latest Articles