శ్రీవారి భక్తులకు అలెర్ట్: 2 రోజుల పాటు నడకదారులు మూసివేత..

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ముఖ్యమైన గమనిక.. రెండు రోజుల పాటు.. తిరుమలకు వెళ్లే రెండు నడకదారులను మూసివేయాలని నిర్ణయించింది టీటీడీ.. రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన టీటీడీ.. ముందస్తు చర్యలు చేపట్టింది.. అందులో భాగంగా.. బుధ, గురువారాల్లో తిరుమలకు వెళ్లే రెండు నడకదారులైన అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు ప్రకటించింది… వర్షాల నేపథ్యంలో.. భక్తుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ వెల్లడించింది… ఈ సమయంలో తిరుమల చేరుకునేందుకు ఘాట్‌రోడ్డే సురక్షితమని సూచించింది. కాగా, తిరుమల వెళ్లే భక్తులు నడకమార్గంలో వెళ్లేందుకు ప్రాధాన్యత ఇస్తారు.. నడకమార్గంలో వెళ్లే శ్రీవారిని దర్శించుకుంటే.. కోరిన కోరికలు నేరవేరుతాయని భక్తుల నమ్మకం.. అయితే, వర్షాల నేపథ్యంలో రెండు రోజుల పాటు నడక దారులు మూతపడనున్నాయి.

Related Articles

Latest Articles