కేంద్రం నిర్ణయం శుభపరిణామం.. రెండు రాష్ట్రాలకు మంచే..!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కొనసాగుతోన్న జలజగడానికి తెరదించాలన్న ఉద్దేశంతో.. కేంద్ర ప్రభుత్వం కృష్ణా, గోదావరి జలాల విషయంలో గెజిట్‌ విడుదల చేసింది.. దీనిపై అభ్యంతరాలు ఓవైపు.. ఆహ్వానించడాలు మరోవైపు జరుగుతున్నాయి.. అయితే, కేంద్ర ప్రభుత్వం జలాల విషయంలో చేసిన గెజిట్ శుభపరిణామం అంటున్నారు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి… తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్‌ ప్రజలందరికీ ఉపయోగపడుతుందన్నారు.. సీఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి జలాల విషయంలో ఎటువంటి వివాదం రాకుండా ఉండేందుకే లేఖలు రాశారన్న ఆయన.. తెలుగు ప్రజల విడిపోయినా.. కలిసి ఉండాలని సీఎం జగన్ అన్నారని.. కేంద్ర ప్రభుత్వం స్పందించడంతో జల వివాదానికి తెర పడిందన్నారు.

also read: మన రాష్ట్రం బంగారు తునక.. నన్ను ఎవరూ ఏమీ చేయలేరు..

మరోవైపు.. వెలిగొండ ప్రాజెక్టుకు అప్పట్లోనే అన్ని రకాల అనుమతులు తీసుకున్నామని తెలిపారు టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి.. వెలిగొండ ప్రాజెక్ట్ కోసం కేంద్రంతో పోరాటం చేస్తామన్న ఆయన.. మాకు ఇచ్చిన అనుమతులు అన్ని కేంద్రానికి పంపుతామన్నారు.. కేంద్రం తీసుకున్న నిర్ణయం రెండు రాష్ట్రాలకు మంచే జరుగుతుందని వ్యాఖ్యానించారు. మరోవైపు.. గెజిట్‌లో కొన్ని అభ్యంతరాలను లేవనెత్తుతోంది తెలంగాణ ప్రభుత్వం.. పార్లమెంట్‌ సాక్షిగా కేంద్రంపై పోరాటానికి సిద్ధం అవుతోంది.. త్వరలోనే పార్లమెంట్‌ సెషన్‌ ప్రారంభం కానుకుండా.. ఇవాళ ఎంపీలతో సమావేశమైన సీఎం కేసీఆర్‌.. వారికి దిశానిర్దేశం చేస్తున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-