ఈ నెల 5న విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేసిన టీటీడీ…

తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య భారీగానే పెరుగుతుంది. నిన్నటి రోజున స్వామివారిని 28422 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక 12058 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా… హుండీ ఆదాయం 2.36 కోట్లుగా ఉంది. అయితే ఈ నెల 5వ తేదిన శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. ఆ కారణంగా 5వ తేదిన విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది టీటీడీ. 6వ తేదిన శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనుండగా…7వ తేది నుంచి 15వ తేది వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 11వ తేదిన రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు సీఎం జగన్.

-Advertisement-ఈ నెల 5న విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేసిన టీటీడీ...

Related Articles

Latest Articles