25 మందితో టీటీడీ కొత్త పాలకమండలి.. జాబితా ఇదిగో..

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి జాబితాను విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం… మొత్తం 25 మందితో టీటీడీ పాలక మండలి ఏర్పాటు చేశారు.. టీటీడీ కొత్త పాలక మండలి సభ్యులుగా ఏపీ నుంచి పోకల అశోక్ కుమార్, మల్లాడి కృష్ణారావు, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఎమ్మేల్యేలు కాటసాని, గోర్ల బాబు రావు, మధుసూదన్ యాదవ్‌కు చోటు దక్కగా.. తెలంగాణ నుంచి రామేశ్వరావు, లక్ష్మీ నారాయణ, పార్థసారధిరెడ్డి, మూరంశెట్టి రాములు, కల్వకుర్తి విద్యా సాగర్‌కు అవకాశం ఇచ్చారు..తమిళనాడు నుంచి శ్రీనివాసన్, ఎమ్మేల్యే నంద కుమార్, కన్నయ్య లకు ఛాన్స్ దక్కగా .. కర్నాటక నుంచి శశిధర్, ఎమ్యెల్యే విశ్వనాధ్ రెడ్డి ఛాన్స్ కొట్టేసింది. అలాగే మహరాష్ర్ట నుంచి శివసేనా కార్యదర్శి మిలింద్ ను చోటు కల్పించింది సర్కార్.

ప్రభుత్వం విడుదల చేసిన టీటీడీ కొత్త పాలక మండలి సభ్యుల పూర్తి జాబితాను పరిశీలిస్తే.. పొలకాల అశోక్‌, మల్లాడి కృష్ణారావు, జూపల్లి రామేశ్వరరావు, మారుతి, జీవన్‌రెడ్డి, పార్థసారథి రెడ్డి, జె. శ్రీనివాసన్‌, రాజేష్‌ శర్మ, సౌరభ్‌, కన్నయ్య, మూసారంశెట్టి రాములు, కల్వకుర్తి విద్యాసాగర్‌, నందకుమార్‌, ఆడిటర్‌ సనత్‌, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, డాక్టర్‌ కేతన్‌ దేశాయ్‌, లక్ష్మీనారాయణ, మిలింద్‌, శశిధర్‌, శంకర్‌, విశ్వనాథ్‌ రెడ్డి, మధుసూదన్‌ యాదవ్‌, గోర్ల బాబూరావు, రాంభూపాల్‌ రెడ్డికి చోటు కల్పించింది ప్రభుత్వం.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-