ఎలుకలు కొరికిన డబ్బుల బాధితుడికి.. మంత్రి సత్యవతి భరోసా

చికిత్స కోసం దాచుకున్న రెండున్నర లక్షల రూపాయ‌ల‌ను ఎలుకలు కొట్టడంతో తీవ్ర బాధలో ఉన్నాడు ఓ వృద్ధుడు. మహబూబాబాద్ మండలం ఇందిరానగర్ తండాలో ఈ ఘటన చోటుచేసుకొంది. ఈ వార్త విన్న గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న రెడ్యాకు ఫోన్ చేసి భరోసా కల్పించారు. రెడ్యాతో ఫోన్ లో మాట్లాడారు. రెడ్యా దాచుకున్న డబ్బులను తిరిగి ఇప్పిస్తానని, ఆయన కోరుకున్న చోట మెరుగైన వైద్యం కల్పిస్తామన్నారు. గతంలో చికిత్సకు అయిన ఖర్చును ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి అందిస్తామని హామీ ఇచ్చారు. మహబూబాబాద్ తహశీల్దార్ రంజిత్ రైతు రెడ్యా వద్దకు వెళ్లి ఎలుకలు కొట్టిన నోట్లను పరిశీలించి పంచనామా నిర్వహించారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-