తెలంగాణ‌లో 3 వేల‌కు పైగా స‌ర్కార్ స్కూళ్లు మూత‌..?

తెలంగాణలో స్కూల్స్ రేషనలైజేషన్ పై విద్యాశాఖలో చ‌ర్చ న‌డుస్తోంది.. అయితే, హేతుబద్దీకరణ చేయాలని పలు ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.. రేషనలైజేష‌న్ చేస్తే రాష్ట్రంలో 3 వేల‌కు పైగా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు మూత‌ప‌డే అవ‌కాశం ఉందంటున్నారు.. దీనిపై 2015-16లో హేతుబద్దీకరణ పై ప్రభుత్వం ఆలోచించినా.. మరో అవకాశం ఇవ్వాలని నిర్ణ‌యం తీసుకుంది ప్ర‌భుత్వం.. అయినా, పాఠశాలల్లో విద్యార్థుల చేరికపై ప‌రిస్థితి మెరుప‌డ‌లేదు.. రాష్ట్రంలోని 1243 పాఠశాలల్లో జీరో అడ్మిషన్స్ దీనికి నిద‌ర్శ‌నం.. ఒక్క విద్యార్థి కూడా లేని వాటిలో 58 ప్రాథమిక, 1175 మాధ్యమిక, 10 ఉన్నత పాఠశాలు ఉన్నాయ‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి.. కేవలం పదిలోపు విద్యార్థులున్న మాధ్యమిక పాఠశాలలు 1,379 కాగా, 11-20 విద్యార్థులున్న పాఠశాలలు 3,297గా ఉన్నాయి.. రేషనలైజేషన్ చేసి స్కూళ్లను మూసివేయాల‌నేదానిపై చ‌ర్చ సాగుతుండ‌గా.. దీని వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులు తీవ్రంగా న‌ష్ట‌పోయే అవ‌కాశం ఉంది.. దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోలేని విద్యార్థులు దీని వల్ల మధ్యలోనే స్కూల్ మానేసే ప్రమాదం ఉంద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి.. మ‌రోవైపు.. రేషనలైజ్ చేస్తే భారీగా టీచ‌ర్ల ఖాళీలు కూడా భారీగా త‌గ్గిపోనున్నాయి.. త్వ‌ర‌లోనే 50 వేల పోస్టుల ప్ర‌క‌ట‌న అని.. అందులో ఉపాధ్యాయుల పోస్టులే 15,000-18000 వ‌ర‌కు అంటూ ప్ర‌చారం సాగింది.. దీంతో.. బీఈడీ చేసి ప్రైవేట్ స్కూళ్ల‌లో జీవితాలు వెల్ల‌దీస్తున్న‌వాళ్లు, ఇత‌ర ప్రైవేట్ ఉద్యోగులు సైతం పెద్ద ఎత్తున టెట్, డీఎస్సీ ప్రిప‌రేష‌న్‌లో మునిగిపోయారు. మ‌రి ప్ర‌భుత్వం దీనిపై తీసుకోనున్న తుది నిర్ణ‌యం ఎలా ఉంటుందో వేచిచూడాలి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-