ఎంసెట్‌ అడ్మిషన్స్‌ కౌన్సెలింగ్‌ రీ షెడ్యూల్..

తెలంగాణలో ఎంసెట్ అడ్మిషన్స్ కౌన్సెలింగ్ తేదీలను రీషెడ్యూల్‌ చేశారు అధికారులు.. ఇంజనీరింగ్ కళాశాలల అనుబంధ గుర్తింపు పూర్తి కాకపోవడం… సీట్ల సంఖ్య ఇంకా ఫైనల్‌ కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.. వెబ్ ఆప్షన్స్ ఈ నెల 4వ తేదీ నుండి కాకుండా 11వ తేదీకి రీషెడ్యూల్‌ చేసిన ఉన్నత విద్యామండలి.. 11వ తేదీ నుండి 16వ తేదీ వరకు వెబ్ ఆప్షన్స్‌కు అవకాశం కల్పించింది.. ఇక, ఈ నెల 18న మొదటి విడత సీట్ల కేటాయింపు చేపట్టనున్నారు అధికారులు.. ఆ తర్వాత రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

Related Articles

Latest Articles

-Advertisement-