ట్రూ కాల‌ర్స్‌… ఇండియాలోనే అత్య‌ధికం…

తెలియ‌ని ఫోన్ నెంబ‌ర్‌తో కాల్ వ‌స్తే అది ఎక్క‌డి నుంచి వ‌చ్చింది ఎవ‌రి పేరుతో ఉన్న‌ది అని తెలుసుకునేందుకు కాల‌ర్ ఐడెంటిఫికేష‌న్ యాప్ ట్రూకాల‌ర్‌ను వినియోగిస్తుంటారు.  11 ఏళ్ల క్రితం ఈ యాప్ ప్రారంభం అయింది.  ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 30 కోట్ల మంది యూజ‌ర్లను సొంతం చేసుకుంది.  గ‌తేడాది వ‌ర‌కు 25 కోట్ల మంది యూజ‌ర్లు ఉండ‌గా, ఏడాది కాలంలో మ‌రో 5 కోట్ల మంది కొత్త యూజ‌ర్లు యాడ్ అయిన‌ట్టు ట్రాకాల‌ర్ యాప్ తెలియ‌జేసింది.  అయితే, ఈ 30 కోట్ల మంది యూజ‌ర్ల‌లో 22 కోట్ల మంది భార‌తీయులే ఉన్నార‌ని యాప్ తెలియ‌జేసింది.  కేవ‌లం కాల‌ర్ ఐడెంటిఫికేష‌న్ మాత్ర‌మే కాకుండా స్పామ్ బ్లాకింగ్‌తో పాటుగా అనేక ఫీచ‌ర్లు అందుబాటులోకి తీసుకొచ్చిన‌ట్టు ట్రూకాల‌ర్ యాప్ తెలియ‌జేసింది.  

Read: నడిరోడ్డుపై యువతుల ముందు జిప్ తీసి ఆ యువకుడు ఏం చేశాడంటే..?

Related Articles

Latest Articles