వైర‌ల్‌: ఆ లారీ రెండు ముక్కలైనా పరుగులు తీసింది…

ఒక్కోసారి జ‌ర‌గే ప్ర‌మాదాలు చాలా విచిత్రంగా ఉంటాయి.  ఎందుకు అలా ప్ర‌మాదాలు జ‌రుగుతాయో తెలియ‌దుగాని, న‌వ్వు తెప్పిస్తుంటాయి.  అలాంటి వాటిల్లో ఈ ప్ర‌మాదం కూడా ఒక‌టి.  లోడ్‌తో వెళ్తున్న లారీ ఓ మ‌లుపు ద‌గ్గ‌రికి రాగానే స‌డెన్ గా కింద‌ప‌డిపోయింది.  అలా కింద‌పడిన లారీ రెండు ముక్క‌ల‌యింది. లారీ పైభాగం వేరుగా కింద‌ప‌డ‌గా కింద ఉన్న బేస్, మాత్రం అలాగే ప‌రుగులు తీసింది.  క్రింద‌ప‌డిన డ్రైవ‌ర్ వెంట‌నే లేచి ఆ లారి కోసం ప‌రుగులు తీశారు.  ఇలాంటి ప్ర‌మాదం బ‌హుశా మ‌రెక్క‌డా జ‌రిగి ఉండ‌దు.  లారీ ప్ర‌మాదానికి ముందు ఓ ఇద్దరు న‌డుచుకుంటూ వెళ్తున్నారు.  వెనుక నుంచి దూసుకొచ్చిన ఆ లారీని చూసి ఇద్ద‌రు షాక్ అయ్యారు.  అక్క‌డి నుంచి ప‌రుగులు తీయ‌డంతో ప్రాణాలు ద‌క్కించుకున్నారు.  ఆ లారీకి దెయ్యం ప‌ట్టింద‌ని, అందుకే అలా జ‌రిగింద‌ని నెటిజ‌న్లు చెబుతున్నారు.  

Read: కాశ్మీర్ యువత కోసం శ్రీనగర్‌లో స్పెషల్ ఎయిర్‌షో…

Related Articles

Latest Articles

-Advertisement-