కొత్త కమిటీల నిర్మాణంపై కేటీఆర్‌ సమీక్ష… కీలక ఆదేశాలు

పార్టీ నిర్మాణం, గ్రామ, వార్డు స్థాయి నుంచి కొత్త కమిటీల ఏర్పాటుపై ఫోకస్‌ పెట్టింది టీఆర్ఎస్‌ పార్టీ.. ఇప్పటికే పలు సందర్భాల్లో పార్టీ కమిటీల విషయంలో టీఆర్ఎస్‌ శ్రేణులకు ఆదేశాలు ఇచ్చిన పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్.. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీలతో సమావేశం నిర్వహించారు.. పార్టీ సంస్థాగత కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. జనరల్ సెక్రటరీలు ఇంఛార్జ్‌లుగా ఉన్న నియోజకవర్గాల వారీగా పార్టీ కార్యక్రమాల వివరాలు అడిగి తెలుసుకున్నారు.. గత రెండు వారాలుగా జరుగుతున్న కమిటీల నిర్మాణంపై సమీక్ష చేశారు. అయితే, ఇప్పటికే దాదాపుగా 80 శాతం పైగా గ్రామ కమిటీల నిర్మాణ వివరాలు అందజేశారు జనరల్ సెక్రటరీలు.

ఈ సందర్భంగా కీలక సూచలను చేశారు కేటీఆర్.. ఈనెల 15వ తేదీ నాటికి అన్ని గ్రామ కమిటీల నిర్మాణం పూర్తి చేసి ఆ వివరాలను కేంద్ర పార్టీ కార్యాలయానికి అందించాలని జనరల్ సెక్రటరీలను ఆదేశించారు.. ఈనెల 20వ తేదీ నాటికి అన్ని మండల కమిటీలు నిర్మాణం పూర్తికావాలన్న ఆయన.. మండల కమిటీల నిర్మాణం పూర్తయిన వెంటనే జిల్లా అధ్యక్షుల ఎంపికను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటిస్తారని తెలిపారు.. జిల్లా అధ్యక్షుల నియామకం పూర్తయిన తర్వాత జిల్లా కమిటీల ఏర్పాటుపైన జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు, మంత్రులు, పార్టీ సీనియర్ నాయకుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని జిల్లా కమిటీల నిర్మాణం పూర్తిచేస్తామన్న ఆయన.. పార్టీ కమిటీల నిర్మాణానికి సంబంధించి వారం రోజుల్లో మరోసారి సమీక్ష నిర్వహించనున్నట్టు తెలిపారు.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-