తెలంగాణలో మూడు ఎమ్మెల్సీలు ఏకగ్రీవం

తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. టీఆర్‌ఎస్‌కు చెందిన ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. వీరిలో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా నుంచి కల్వకుంట్ల కవిత, ఉమ్మడి రంగారెడ్డి నుంచి పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్‌ రాజు ఉన్నారు. వీరి ఎన్నికను అధికారికంగా ప్రకటిస్తారు.

ఏకగ్రీవమైనవారికి నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని రిటర్నింగ్‌ అధికారులు అందజేస్తారు. స్థానిక సంస్థల కోటాలో తొమ్మిది జిల్లాల్లోని 12 స్థానాలకు డిసెంబర్‌ 10న పోలింగ్‌ నిర్వహించనున్నారు. నామినేషన్లకు మంగళవారంతో గడువు ముగియడంతో రిటర్నింగ్‌ అధికారులు బుధవారం వాటిని పరిశీలించారు. మొత్తం 99 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా స్క్రూటినీలో 24 నామినేషన్లను తిరస్కరించారు. ఏకగ్రీవం మినహా మిగిలిన స్థానాల్లోనూ గులాబీ పార్టీ హవా కొనసాగుతోంది.

Related Articles

Latest Articles