ఎల్లుండి హైదరాబాద్‌లో టీఆర్ఎస్‌ మహా ధర్నా..

ధాన్యం కొనుగోలు అంశం పై అధికారు టీఆర్‌ఎస్‌ పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్లుండి హైదరాబాద్‌ మహా ధర్నా చేయాలని నిర్ణయం తీసుకుంది టీఆర్‌ఎస్‌ పార్టీ. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వైఖరిపై నిరసన గా ఎల్లుండి ఉదయం 11 గంటలకు ఇందిరాపార్క్‌ దగ్గర మహా ధర్నా చేయాలని నిర్నయం తీసుకుంది అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ. ఇక ఈ మహా ధర్నా లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ లు, ఎమ్మెల్యేలు ఇతర నాయకులు కూడా స్వయంగా పాల్గొననున్నారు. ఈ మేరకు టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. కాగా… గత శుక్ర వారం టీఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా కేంద్రం పై తీరుపై ధర్నాలు చేసిన సంగతి తెలిసిందే.

Related Articles

Latest Articles