మహాధర్నా అనంతరం టీఆర్‌ఎస్ పాదయాత్ర..

కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలంటూ టీఆర్‌ఎస్‌ అధినేత సహా టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఇందిరాపార్క్‌ వద్ద మహాధర్నా చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు లతో పాటు భారీ ఎత్తున్న టీఆర్‌ఎస్‌ శ్రేణులు, రైతులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. అయితే ఈ మహా ధర్నా అనంతరం టీఆర్‌ఎస్‌ పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

మహాధర్నా ముగిశాక రాజ్‌భవన్‌కు పాదయాత్రగా వెళ్లనున్నట్లు సమాచారం. సీఎం కేసీఆర్‌తో పాటు ప్రజా ప్రతినిధులంతా రాజ్‌భవన్‌కు పాదయాత్రగా వెళ్లే అవకాశం ఉంది. ఈ పాదయాత్ర సచివాలయం మీదుగా రాజ్‌భవన్‌కు చేరుకోనుంది. మధ్యాహ్నం 2 గంటల వరకు ఇందిరాపార్క్‌లో మహాధర్నా కొనసాగనుంది. ప్రస్తుతం పలువురు నేతలు కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకంగా వ్యాఖ్యానిస్తున్నారు.

Related Articles

Latest Articles