బీజేపీలోకి టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్..? క‌్లారిటీ వ‌చ్చిన ఎంపీ

తాజాగా టీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పిన మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.. తాను రాజీనామా చేసిన హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి కాస్త వెనుకో ముందు ఉప ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండ‌డంతో.. నియోజ‌క‌వ‌ర్గంపై ఫోక‌స్ పెట్టి.. ఇంటికి వెళ్లి అంద‌రినీ క‌ల‌వాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.. ఇదే స‌మ‌యంలో.. మ‌రికొంత‌మంది నేత‌లు బీజేపీలో చేర‌తార‌నే ప్ర‌చారం సాగుతోంది.. ప‌నిలో ప‌నిగా.. టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ కూడా త్వరలోనే బీజేపీలో చేరుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. జహీరాబాద్ లోక్ సభ స్థానం నుంచి విజ‌యం సాధించిన ఆయ‌న‌.. కాషాయం కండువా క‌ప్పుకుంటార‌ని ప్ర‌చారం సోష‌ల్ మీడియాలో ఊపందుకుంది.. అయితే, దీనిపై స్పందించారు ఎంపీ బీబీ పాటిల్.. బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించిన జహీరాబాద్ ఎంపీ.. తాను బీజేపీలో చేరుతున్నట్టు సోషల్ మీడియాలో వస్తున్నవార్తల్లో నిజం లేద‌ని క్లారిటీ ఇచ్చారు.. తాను టీఆర్ఎస్ పార్టీని వీడేది లేద‌ని స్ప‌ష్టం చేసిన ఆయ‌న‌.. తన పై అసత్య ప్రచారం చేస్తున్నవారిపై పరువు నష్టం దావా వేస్తాన‌ని హెచ్చ‌రించారు.. ఇక‌, పార్లమెంట్ పరిధిలో ఎమ్మెల్యేలతోకూడా నాకు ఎలాంటి విబేధాలు లేవ‌న్న ఆయ‌న‌.. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో రెండో సారి ఎంపీని అయ్యాను.. టీఆర్ఎస్‌ను వీడేది లేద‌న్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-