రెండో విడతలో గొర్ల పంపిణీ కోసం 6 వేల కోట్లు…

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దేశంలో ఎక్కడా లేని పథకాలు అమలౌతున్నాయు. మొదటి విడతలో గొర్ల కాపర్లకు రూ. 5 వేల కోట్లతో 3లక్షల 71 వేల మందికి గొర్రెల పంపిణీ చేశారు. రెండో విడతలో గొర్ల పంపిణీ కోసం 6 వేల కోట్లు రూపాయలు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు అని టీఆర్ఎస్, రాజ్యసభ ఎంపీ లింగయ్య యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు. గతంలో డీడీలు కట్టిన వారికి కూడా ఇది వర్తిస్తుంది.

గతంలో ఒక గొర్రెల యూనిట్ కు 1లక్ష 31వేలు ఉండేది. ఇప్పుడు దానిని 1లక్ష 75 వేలు పెంచడం హర్షణీయం. రెండో విడతలో 3 లక్షల 81వేల మందికి లబ్ది జరగనుంది. మాంసం ఉత్పత్తిలో రాజస్థాన్ ను అధిగమించి.. తెలంగాణ మొదటి స్థానానికి వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలోనే ఇది సాధ్యమైంది. చేపల పంపిణీ, మార్కెటింగ్ కు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. “మిషన్ కాకతీయ” తో చెరువుల పునరుద్ధరణ జరిగింది. చేనేత కార్మికులకు రూ. 5 లక్షల బీమా అందిస్తున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం కుల వృత్తులకు చేయూతనిస్తోది. బీసీల్లో గుణాత్మక మార్పు రావాలని ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. “దళిత క్రాంతి” పథకం ద్వారా ఆ వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారు అని పేర్కొన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-