ఈట‌ల ఆయ‌న రాజ‌కీయ స‌మాధి ఆయ‌నే క‌ట్టుకున్నారు..!

మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ‌వ్య‌వ‌హారంపై సీరియ‌స్ అయ్యారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి.. హైద‌రాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌.. ఈటల విషయంలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్.. ఎప్పుడు ఏ చర్య అవసరం అనుకుంటే ఆ చర్య తీసుకుంటార‌ని ప్ర‌క‌టించారు. ఇక‌, ఈటల ఇప్ప‌టి వ‌ర‌కు చెబుతూ వ‌చ్చిన బహుజన వాదం, వామపక్ష వాదం ఎక్క‌డికి పోయింద‌ని ప్ర‌శ్నించిన రాజేశ్వ‌ర్‌రెడ్డి.. 40 ఎకరాల అసైన్డ్ భూమి తీసుకున్నానని ఈటల స్వయంగా ఒప్పుకున్నార‌ని వ్యాఖ్యానించారు.. వైఎస్, రోష‌య్య, కిరణ్ కుమార్ లను కలిశాను అంటున్న ఈటల… ఎవరి ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టారు ? అని మండిప‌డ్డారు.. ఇక‌, ఆయ‌న‌.. మాట్లాడేది ఒకటి… చేసేది మ‌రొక‌టి అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ప‌ల్లా.. పార్టీలో సమర్థులు ఉన్నా.. సీఎం కేసీఆర్.. ఈటలకు అనేక పదవులు కట్టబెట్టార‌ని గుర్తుచేశారు.. కానీ, ఈట‌ల ఆయన రాజకీయ సమాధి ఆయనే కట్టుకున్నార‌ని కామెంట్ చేశారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-