మధు యాష్కీని మాత్రం వదిలేది లేదు.. జైలుకే..!

కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచి ఆ తర్వాత పార్టీని వీడిన ఎమ్మెల్యేలపై టి.పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.. తర్వాత ఆ ఎమ్మెల్యేలు కౌంటర్‌ ఎటాక్‌ దిగినా.. మరోవైపు.. కాంగ్రెస్‌ పార్టీ నుంచి అదే స్థాయిలో విమర్శలు వచ్చాయి.. ఇక, నిన్న గాంధీ భవన్‌ వేదికగా.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్‌ నేత మధుయాష్కీ గౌడ్‌.. ముఖ్యంగా మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని టార్గెట్‌ చేశారు.. అయితే, మధు యాష్కీ కామెంట్లపై సీరియస్‌గా రియాక్ట్‌ అయ్యారు టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ నేతల బండారం మా దగ్గర ఉందన్న ఆయన.. మధు యాష్కీ అక్రమ వీసాలతో వందల మందిని విదేశాలకు తీసుకెళ్లారని ఆరోపించారు.. మధు యాష్కీకి సవాలు విసురుతున్న… నిజామాబాద్‌లో ఏ సెగ్మెంట్ కు రమన్నా వస్తానన్న సుధీర్‌ రెడ్డి.. మధు యాష్కీ అక్రమాలను నిరూపిస్తా… ఆయన జైలుకు వెళ్లేది ఖాయమని.. మధు యాష్కీని మాత్రం వదిలేది లేదని వ్యాఖ్యానించారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-