టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. పాలకవర్గానికి క్యాన్సర్..!

అధికార టీఆర్ఎస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.. ఇవాళ వాకర్స్ వెలిఫేర్‌ అసోసియేషన్ సమావేశంలో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్… జగిత్యాల అధికార మున్సిపల్ పాలక వర్గంపై హాట్ కామెంట్స్ చేశారు.. జగిత్యాల మున్సిపల్ పాలక వర్గానికి క్యాన్సర్ వచ్చిందంటూ కాకరేపిన ఆయన.. జగిత్యాల బల్దియా రోగం త్వరలో బాగు చేయాలి అని కామెంట్‌ చేశారు..

Read Also: మాంసాహారం విక్రయాలపై గుజరాత్‌ సంచలన నిర్ణయం.. వారికి షాక్..!

ఇక, టీఆర్ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్.. అంతా చెట్లు నాటాలని పిలుపునిచ్చిన ఆయన.. హరితహారంలో అందరూ పాల్గొనాలని.. రేపటి తరాలకు చెట్లు బహుమానంగా ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.. ఏ ప్రభుత్వం అయినా వంద శాతం పనులు చేయదు.. ప్రజల భాగస్వామ్యం చాలా అవసరం అన్నారు ఎమ్మెల్యే.. కరోనా రాకపోతే చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగేవి అన్నారు.. అయితే, జగిత్యాల పాలకవర్గంపై ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి..

Related Articles

Latest Articles