ఎన్నికల కోసమే రైతు చట్టాలు వెనక్కి : ఎమ్మెల్యే క్రాంతి కిరణ్

ఆందోల్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే క్రాంతికిరన్ మీడియా సమావేశం లో మాట్లాడుతూ… దేశంలో ప్రవేశపెట్టిన రైతు చట్టాలను వెనక్కి తీసుకున్నందుకు హర్షం. కేంద్రం దిగివచ్చే విధంగా రైతులు పోరాటం చేశారు.ఇది రైతుల విజయం. ఈ రైతు చట్టాలు రైతుల జీవితాలను ఆగం చేస్తుందని తెరాస పార్టీ ముందుగానే గుర్తించి వెతిరేకించింది. కేంద్ర వైఖరిని నిరసిస్తూ నియోజకవర్గ కేంద్రాల్లో టీఆర్ ఎస్ పార్టీ ధర్నా చేసింది. రైతు విధానాల పట్ల బీజేపీ అవలంబిస్తున్న విధానాన్ని నిరసిస్తూ కేసీఆర్ చేసిన ధర్నాతో కేంద్రం దిగివచ్చింది. కేసీఆర్ చేసిన ధర్నాతో మిగతా రాష్ర్టాల ముఖ్యమంత్రులు ధర్నాలు చేస్తారనే ఉదేశంతోనే కేంద్రం రైతు చట్టాలను రద్దు చేసింది. కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం ప్రచారం చేస్తే అది నియంతృత్వ0 అని బీజేపీ,కాంగ్రెస్ ప్రచారం చేసింది. ఇప్పటికైనా వరి కొనుగోలు చేస్తుందో లేదో అనే విషయంపై కేంద్రం స్పష్టమైన హామీ ఇవ్వాలి. యూపీ ఎన్నికల రాజకీయం కోసమే చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకుంది అని పేర్కొన్నారు.

Related Articles

Latest Articles