రేవంత్‌కి ఎమ్మెల్యే సవాల్.. ఒక్క ఓటు పెరిగినా నేను, నా భార్య రాజీనామా..!

హుజురాబాద్‌ అసెంబ్లీ స్థానానికి త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి.. ఇప్పటికే టీఆర్ఎస్‌, బీజేపీ తమ అభ్యర్థులను బరిలోకి దింపగా.. కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థిపై ఇంకా కసరత్తు చేస్తూనే ఉంది.. అయితే, హుజురాబాద్‌ ఉప ఎన్నికలపై పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి బహిరంగ సవాల్‌ విసిరారు టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి… గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి హుజురాబాద్ లో 60 వేల ఓట్లు వచ్చాయని.. ఈ సారి 60 వేల ఓట్ల కంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ ఛాలెంజ్‌ చేశారు. ఇక, రేవంత్ రెడ్డి పోటీ చేసినా సరే- ఆ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ నిలబడ్డా ఒకే.. గత ఎన్నికల కంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా నేను – నా భార్య.. మా పదవులకు రాజీనామా చేస్తాం అని ప్రకటించారు గండ్ర.. మరోవైపు, సత్యనారాయణ నక్సలైట్లకు సానుకూలంగా ఉన్నది మర్చిపోవద్దన్న ఆయన.. రోజుకో పార్టీ మార్చే సత్యనారాయణకు నా గురించి మాట్లాడే స్థాయి లేదన్నారు.. నా గౌరవానికి భంగం కలిగించే విధంగా మాట్లాడినందుకు రేపు పరువునష్టం కేసు వేస్తానంటూ హెచ్చరించారు.

-Advertisement-రేవంత్‌కి ఎమ్మెల్యే సవాల్.. ఒక్క ఓటు పెరిగినా నేను, నా భార్య రాజీనామా..!

Related Articles

Latest Articles