తెలంగాణ పట్ల బీజేపీ చిన్న చూపు చూస్తుంది : హరీష్ రావు

ఈ రోజు బెంగాల్ ల్లో మమత గెలిచింది. రేపు మత తత్వ బీజేపీ కి హుజురాబాద్ లో స్థానం లేదని చెప్పాలి అని మంత్రి హరీష్ రావు అన్నారు. లెఫ్ట్ అన్న ఈటల రాజేందర్ రైటీస్ట్ గా ఎలా బీజేపీలో చేరారు… నల్లా చట్టాలు అని చెప్పిన ఈటల రాజేందర్ ఆ పార్టీలో ఎలా చేరారు అని ప్రశ్నించిన ఆయన స్వార్థం కోసం బీజేపీలో చేరారు ఈటల రాజేందర్ అని తెలిపారు. ఇక తెలంగాణ పట్ల బీజేపీ చిన్న చూపు చూస్తుంది అని చెప్పిన హరీష్ రావు… వ్యాక్సిన్ ఈస్తల్లేరు అన్న ఈటల కు ఇప్పుడు బీజేపీ ఎలా దగ్గర అయ్యింది. బీజేపీ వల్ల దళితులు, బీసీలు ఏం లభ్ది పొందారు. బీసీ మంత్రిత్వశాఖ పెట్టాలని కోరిన పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసింది అని తెలిపారు. రోజుకో కేంద్రమంత్రి వస్తున్నారు. మరి వాళ్ళు తెలంగాణ కు ఏం ఇస్తామని చెప్పారు. బీజేపీ డీజిల్, పెట్రోల్ ధరలు పెంచింది. వాటిని మంత్రులు తగ్గిస్తారా లేదా అనేది చెప్పాలి అని పేర్కొన్నారు.

-Advertisement-తెలంగాణ పట్ల బీజేపీ చిన్న చూపు చూస్తుంది : హరీష్ రావు

Related Articles

Latest Articles