టీఆర్ఎస్‌లోకి టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ర‌మ‌ణ‌..?

ఓవైపు టీఆర్ఎస్ నేత‌ల‌కు బీజేపీ గాలం వేస్తుంటే.. మ‌రోవైపు.. ఇత‌ర పార్టీల నేత‌ల‌పై గురిపెట్టింది టీఆర్ఎస్ పార్టీ.. అందులో భాగంగా.. టీడీపీ తెలంగాణ అధ్య‌క్షుడు ఎల్‌. ర‌మ‌ణ‌ను కూడా పార్టీలోకి ఆహ్వానించారు టీఆర్ఎస్ నేత‌లు.. ఎల్‌. ర‌మ‌ణ‌తో టీఆర్ఎస్ నేత‌లు మంత‌నాలు జ‌రిపిన‌ట్టుగా తెలుస్తోంది.. ర‌మ‌ణ‌కు ఫోన్ చేసిన‌ టీఆర్ఎస్ నేత‌లు.. పార్టీలోకి రావాల‌ని ఆహ్వానం ప‌లికార‌ట‌.. మాజీ మంత్రి ఈటల రాజేంద‌ర్‌ రాజీనామాతో ఏర్ప‌డిన బీసీ నేత లోటును.. మరో బీసీ నేతను తీసుకు వ‌చ్చి పూడ్చే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని టాక్‌.. దీంతో ఎల్‌ రమణకు ఎమ్మెల్సీ స్థానం ఆఫర్ చేసిన‌ట్టు కూడా ప్ర‌చారం సాగుతోంది.. ఇక‌, చంద్ర‌బాబు హయాంలో మంత్రిగా పనిచేసిన రమణ.. తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత టీడీపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నిక‌య్యారు.. తాజాగా, హైద‌రాబాద్‌-రంగారెడ్డి-మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎమ్మెల్సీ స్థానానికి కూడా ఆయ‌న పోటీ చేసి ఓట‌మిపాల‌య్యారు.. మ‌రోవైపు.. ఇప్పుడు టీఆర్ఎస్‌లో ఉన్న కీల‌క నేత‌లు, మంత్రులు కూడా టీడీపీ నుంచి వ‌చ్చిన‌వారే కావ‌డంతో.. ఎల్. ర‌మ‌ణ‌తో చ‌ర్చ‌లు జ‌రిపే బాధ్య‌త కూడా వారికే ఇచ్చిన‌ట్టుగా స‌మాచారం. మ‌రి ఎల్‌.ర‌మ‌ణ కారు ఎక్కేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-