తెలంగాణ గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదు: కడియం

వ్యవసాయరంగానకిప్రోత్సాహకాలు ఇవ్వకుండా రాష్ర్ట ప్రభుత్వం పై ఆరోపణలు చేయడం సరికాదని టీఆర్‌ఎస్‌ నేత కడియం శ్రీహరి బీజే పీ నేతలను ఉద్దేశించి అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లా డుతూ.. బీజేపీ పై నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని, తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కును బీజేపీ కోల్పోయిందన్నారు. పుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సీఐ) ని ధాన్యం కొనకుండా ఆదేశాలు జారీ చేస్తు అటూ సంస్థను, ఇటు రైతులను బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. ధనిక పారిశ్రా మిక వేత్తలకు రుణాల మాఫీ చేశారు. కానీ రైతులను ఎనాడు పట్టించు కోలేదన్నారు. వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి ఏడాది కాలంగా రైతు లను హింస పెట్టారన్నారు. 600 మంది రైతుల బలి దానాల తర్వాత రైతు చట్టాల ఉపసంహారణ రైతుల మీద ప్రేమతో చేశారా లేదా వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేశారా అంటూ ఆయన ఎద్దేవా చేశారు. మరోవైపు పంజాబ్‌లో కొన్నట్టు తెలంగాణలో ధాన్యం ఎందుకు కొనరని ఆయన మండిపడ్డారు. రాష్ర్ట బీజేపీ నేతలకు కేంద్రం దగ్గరికి వెళ్లి తెలంగాణకు రావాల్సిన నిధులు తీసుకొచ్చే దమ్ము లేదన్నారు.

ఇప్పటికైనా కేంద్రం ధాన్యం ఎంత కొంటారో చెప్పాలని, తెలంగాణ రైతులను ఇబ్బందుల పాలు చేయోద్దని ఆయన హితవు పలికారు. రైతుల మీద చిత్త శుద్ధి ఉంటే రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలని కడియం శ్రీహరి అన్నారు. రైతు పంటల ఫసల్‌భీమా పేరుతో రైతులను ఇబ్బందులు పెడుతుందన్నారు. ఆ డబ్బులు సకాలంలో రాక రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారన్నారు. రైతులపై ప్రేమ ఉంటే వెంటనే ధాన్యం కొనుగోలు చేసేలా కేంద్రం నిర్ణయం తీసుకోవాలన్నారు.

Related Articles

Latest Articles