క‌రోనాతో టీఆర్ఎస్ నేత మృతి

క‌రోనా మ‌హ‌మ్మారి బారిన‌ప‌డి ఇప్ప‌టికే ఎంతో మంది ప్రాణాలు వ‌దిలారు.. ఇక‌, సెకండ్ వేవ్‌లో పాజిటివ్‌ కేసుల సంఖ్యే కాదు.. మృతుల సంఖ్య కూడా భారీగా న‌మోదు అయ్యింది.. ప్ర‌ముఖులు, ప్ర‌జాప్ర‌తినిధుల‌తో పాటు.. కొంద‌రు రాజ‌కీయ పార్టీల నేత‌ల‌ను కూడా క‌రోనా ప్రాణాలు తీసింది.. ఇవాళ టీఆర్‌ఎస్ నేత‌, కార్మిక సంఘాల నేత, మహబూబాబాద్‌ జిల్లా తొరూరు మున్సిపాలిటీ 7వ వార్డు కౌన్సిలర్‌ మాడ్గుల నట్వర్… ఇవాళ ఉద‌యం మ‌ర‌ణించారు.. హైదరాబాద్‌లోని ఓ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు న‌ట్వ‌ర్.. ఆయ‌న‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. నట్వర్‌ మృతికి మంత్రి ఎరబెల్లి దయాకర్‌రావుతో పాటు.. ప‌లువురు టీఆర్ఎస్ నేత‌లు సంతాపం వ్య‌క్తం చేశారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-