టీఆర్ఎస్ సర్కారు అమానుషంగా ప్రవర్తించింది : సోము వీర్రాజు

నిన్న కరీంనగర్‌లోని బీజేపీ కార్యాలయంలో ఉద్యోగుల సమస్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ జాగరణ దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు ఆయనను అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంలో బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మొత్తానికి నాటకీయ పరిణమాల మధ్య బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే ఈ రోజు బండి సంజయ్‌ను పోలీసులు కరీంనగర్‌ ఎక్సైజ్‌ కోర్టు హజరుపరిచారు.

దీంతో ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్‌ ను విధించింది.ఈ సందర్భంగా ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు ఈ ఘటనపై స్పందించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు మద్దతుగా శాంతియుతంగా జాగరణ చేస్తున్న బండి సంజయ్ పై టీఆర్ఎస్ సర్కారు అమానుషంగా ప్రవర్తించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార మదంతో పోలీసులను ఉపయోగించి బండి సంజయ్ ని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు.

Related Articles

Latest Articles