సెప్టెంబర్ 2 నుంచి టిఆర్ఎస్ జెండా పండగ : హరీష్ రావు

సెప్టెంబర్ రెండో తేదిన టీఆర్‌ఎస్‌ పార్టీ జెండా పండుగ జరుగనున్నట్లు మంత్రి హరీష్‌ రావు పేర్కొన్నారు. టీ ఆర్ ఎస్ ప్రజాప్రతినిధులతో ఇవాళ మంత్రి హరీశ్ రావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. సెప్టెంబర్ రెండో తేదిన జరిగే పార్టీ జెండా పండగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని..ఢిల్లీలో పార్టీ కార్యాలయ భవనానికి సీఎం కేసీఆర్ శంకుస్థాప‌న చేయ‌నున్నారని తెలిపారు. అదే రోజున తెలంగాణ వ్యాప్తంగా అన్నీచోట్ల, అన్నీ గ్రామాలు, పట్టణాల్లో జెండా పండుగ చేయాలని పిలుపునిచ్చారు. జెండా పండుగలో ప్రజలను భాగస్వామ్యం చేయాలన్నారు. జెండా పండుగ అంటే.. తెలంగాణ పండుగ అని… టీఆర్ఎస్ పండుగ అంటే తెలంగాణ ప్రజల పండుగ అని వివరించారు. జెండా పండుగను నిర్లక్ష్యం చేయొద్దని… నిర్లక్ష్యం వహించిన వారిపై పార్టీ చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.

Related Articles

Latest Articles

-Advertisement-