టీఆర్ఎస్ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది: కడియం శ్రీహరి

టీఆర్‌ఎస్‌ ఆరు ఎమ్మెల్సీలు ఏకగ్రీవమైన సందర్భంగా కడియం శ్రీహరి మట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాకు అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలపారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుంది తెలంగాణ అని ఆయన చెప్పారు. టీఆర్‌ఎస్‌ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిందన్నారు. అన్ని ప్రాం తాలు, అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకు సీఎం కేసీఆర్ చిత్త శుద్ధితో కృషి చేస్తున్నారన్నారు. అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో చిత్తశుద్ధితో పనిచేస్తామని వెల్లడించారు.

అన్ని రంగాల్లో ఎదుగుతున్న తెలంగాణను ఓర్వలేక బీజేపీ, కేంద్రం తెలంగాణా ప్రభుత్వం అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతుందని ఆరోరపించారు. మోడీ, బీజేపీ అధికారంలోకి వచ్చి ఏడేళ్లు అవుతున్నా ఏం సాధించారో దేశ ప్రజలకు చెప్పాలన్నారు. ఈ ఏడేళ్లలో దేశ జీడీపీ భారీగా తగ్గిందన్నారు. కరోనా సమయంలో మైనస్‌ జీడీపీకి వెళ్లిందని ఆయన చెప్పారు. నరేంద్ర మోడీ గొప్ప పరిపాలన ధక్షకుడు అయిదే దేశ జీడీపీ ఎలా తగ్గిందో రాష్ర్ట బీజేపీ నేతలు చెప్పాలని కడియం అన్నారు. ధాన్యం సేకరణ అనేది కేంద్రం పరిధిలో ఉన్న అంశమని కానీ కేంద్రం తెలంగాణ ధాన్యం కొనడం లేదని అన్నారు. ఇప్పటికైనా బీజేపీ నేతలు మొద్దు నిద్ర వీడి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢీల్లీలో పోరాటం చేయాలని కడియం శ్రీహరి అన్నారు.

Related Articles

Latest Articles