హుజురాబాద్‌ బైపోల్‌.. నామినేషన్ల హడావిడి షురూ

హుజురాబాద్‌ ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. మొదటి రోజే టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ తన నామినేషన్‌ పత్రాలను ఆర్డీవో కార్యాలయంలో సమర్పించారు. ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారికి సమర్పించిన అఫిడ‌విట్‌లో ఆయన త‌న ఆస్తుల వివ‌రాలు వెల్లడించారు. చరాస్తుల విలువ 2 లక్షల 82 వేలు కాగా, స్థిరాస్తుల విలువ 20 లక్షలుగా పేర్కొన్నారు. ఆయ‌న ఏడాది సంపాద‌న 4 లక్షల 98 వేలు. హుజూరాబాద్‌ ప్రజలు తనని ఆశీర్వదిస్తే నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని అన్నారు శ్రీనివాస్. కాగా, ఈరోజు మొత్తం రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల పర్వం ఈనెల 8 వరకు కొనసాగనుండగా.. ఈ నెల 30వ తేదీన హుజురాబాద్‌లో పోలింగ్‌ జరగనున్న సంగతి తెలిసిందే.

-Advertisement-హుజురాబాద్‌ బైపోల్‌.. నామినేషన్ల హడావిడి షురూ

Related Articles

Latest Articles