తేజ్ యాక్సిడెంట్… బండి తప్పు లేదు

టాలీవుడ్ హీరో కు నిన్న సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. బైక్ పై నుంచి పడిన తేజ్ కు తీవ్ర గాయాలు కావడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదం సమయంలో తేజ్ నడుపుతున్న బండి ‘త్రియంఫ్’ కంపెనీకి చెందింది. దాంతో ఆ బండి షో రూమ్ నిర్వాహకులు ప్రమాదం పై స్పందిస్తూ.. త్రియంఫ్ వెహికిల్ మిస్టేక్ ఏమాత్రం లేదు. ఒక్కో మోడల్.. ఒక్కో రకమైన ప్రత్యేకతతో డిజైన్ అవుతాయి. రైడర్ మిస్టేక్ లేదా.. రోడ్స్ వళ్ల ప్రమాదాలు జరుగుతాయి. సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ కూడా మట్టి వల్లే జరిగింది అన్నారు. ఎంత స్పీడ్ లో ఉన్నా… బ్రేక్ కొట్టగానే బైక్ ఆగిపోతుంది. కానీ.. మట్టి ఉండటం వల్ల స్కిడ్ అయ్యింది. మా షో రూమ్ కి సాయి ధరమ్ తేజ్ అప్పుడప్పుడు వస్తుంటారు. కొత్త మోడల్ ఏది వచ్చినా.. వస్తుంటారు అని తెలిపారు. రైడర్స్ గ్రూప్ ఉంది. వీక్ ఎండ్ లో రైడ్ కి వెళ్తుంటారు. 2014 నుంచి హైదరాబాద్ లో 700 వెహికిల్స్ అమ్ముడయ్యాయి. ఇప్పటివరకు త్రియంఫ్ బండి ఒక్కటి కూడా యాక్సిడెంట్ కు గురవ్వలేదు అని పేర్కొన్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-