కాజల్ ను రీప్లేస్ చేయనున్న చెన్నై చంద్రం

లోక నాయకుడు కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ ల భారీ ప్రాజెక్ట్ “ఇండియన్ 2” పలు వివాదాలతో మధ్యలోనే ఆగిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ వివాదాలన్నీ సద్దుమణగడంతో మేకర్స్ ఎట్టకేలకు సినిమాకు సంబంధించిన పనులను వేగవంతం చేస్తున్నారు. డిసెంబర్‌లో సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇంతకుముందు “ఇండియన్ 2” సినిమాకు కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా తీసుకున్న మేకర్స్ ఆమె స్థానంలో ఇప్పుడు త్రిష కృష్ణన్‌ను తీసుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో ఆమె వృద్ధురాలి పాత్రలో కనిపించనుంది. దాని కోసం ప్రొస్తెటిక్ మేకప్ కూడా చేయించుకున్న కాజల్ స్థానంలోకి త్రిష వచ్చి చేరనుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో కాజల్ అగర్వాల్ గర్భవతి అని పుకార్లు వచ్చాయి. కాజల్ ఇంకా ఈ విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. కానీ కొన్ని ప్రాజెక్ట్‌ల నుండి తప్పుకుంది.

Read Also : సూర్యకు బెదిరింపులు… దాడి చేస్తే లక్ష రివార్డు

ఇక ‘ఇండియన్ 2’ విషయానికొస్తే… ఈ చిత్రం అధికారికంగా 2017లో స్టార్ట్ అయ్యింది. ఈ చిత్రం నాలుగు సంవత్సరాలకు పైగా నిర్మాణ దశలోనే ఉంది. “ఇండియన్ 2″లో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్ కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కరన్‌ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. సినిమా అప్‌డేట్‌ల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related Articles

Latest Articles