ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉత్సవంగా త్రిపురనేని జయంతి

ప్రముఖ హేతువాద ఉద్యమ నేత, కవి త్రిపురనేని రామస్వామి చౌదరి జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ ఆయన స్వస్థలమైన కృష్ణా జిల్లాలో ఈ వేడుకలను నిర్వహించనున్నారు. త్రిపురనేని కృష్ణా జిల్లా అంగలూరులో జన్మించారు. విశాల భావాలతో రామస్వామి నాటి సమాజం పై చెరగని ముద్ర వేశారు. సంఘసంస్కరణ కర్తగా సమాజంలో మార్పును ఆకాంక్షించారు రామస్వామి చౌదరి. తన కలంతో ఎంతోమందిని కదిలించేలా చేశారు.ఇతరులను ప్రశ్నించటం సులభం. కాని తనను తాను ప్రశ్నించుకుని తగిన సమాధానం చెప్పి ఒప్పించటం చాలా కష్టం. అటువంటి కష్టమైన పనిని దాటవేయకుండా తాను అనుసరిస్తూవచ్చిన ప్రతి అంశాన్నీ తనదైన పంథాలో సమర్థించుకుంటూ రామస్వామి ముందుకు వెళ్లారు.

Read Also: మూడో రోజు రవాణా శాఖ స్పెషల్ డ్రైవ్.. బస్సులు సీజ్‌..

తమిళనాడులోని రామస్వామి నాయకర్ తరహాలో ఆంధ్రలో ఈ రామస్వామి చౌదరి బ్రాహ్మణేతర ఉద్యమాన్ని నడిపించాడు. మత మౌడ్యాలకు స్వస్తిచెప్పి మానవతకు పట్టం కట్టాలన్నది రామస్వామి సిద్ధాంతం. చదువుకుంటూనే రామస్వామి రాసిన రాణా ప్రతాప్‌ నాటకాన్ని బ్రిటీష్‌ ప్రభుత్వం నిషేధించింది. పెళ్లి మంత్రాలను సంస్కృత మంత్రాలతో నిర్వహించడం వలన సమాజం లో ఏ కొద్ది మందిలో మాత్రమే ఈ తంతు నిర్వహిస్తున్నారని ఈ విధానాన్ని మార్చాలని రామస్వామి పోరాడారు. సూత పురాణం, కుప్పుస్వామి శతకం, భగద్గీత తదితర రచనలు చేశారు రామస్వామి.

Related Articles

Latest Articles