సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు.. కోర్టు ధిక్కారానికి భయపడొద్దు..!

ఏ ప్రభుత్వం అయినా.. కోర్టుల నుంచి మొట్టకాయలు పడకుండా.. న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా పనిచేసేందుకు ప్రయత్నాలు చేస్తాయి.. ఏదైనా కొత్త పథకం తెచ్చే సమయంలో.. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే సమయంలో.. దానికి ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది..? అనే దానిపై కూడా సమాలోచనలు చేసి ముందుకు వెళ్తుంటారు.. అయితే, కొన్నిసార్లు న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తూనే ఉంటుంది.. అయితే, త్రిపుర సీఎం బిప్లబ్‌ దేవ్‌ మాత్రం.. అవి ఏమీ పట్టించుకోవద్దు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోర్టు ధిక్కారానికి భయపడకుండా పనిచేయాలని అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి… ఇవాళ త్రిపుర సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ 26వ వార్షికోత్సవ సమయంలో.. అధికారులతో సీఎం బిప్లబ్ దేవ్ మాట్లాడుతూ.. మన వ్యవస్థలో ఒక నిర్దిష్ట పనిని చేయలేకపోతున్నామని అధికారులు చెప్పారు.. ఏం చేసినా కోర్టు ధిక్కరణ అవుతుందేమో అని చాలా మంది అధికారులు భయపడుతున్నారు.. కానీ, అలా ఎందుకు భయపడాలి..? కోర్టు ధిక్కారానికి రాష్ట్రంలో ఎవరైనా జైలుకు వెళ్లారా..? నేను ఇక్కడే ఉన్నాను… మీరు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితే వస్తే మీకంటే ముందు నేను వెళ్తా.. మిమ్మల్ని జైల్లో పెట్టడం అంత సులభం కాదు అంటూ చెప్పుకొచ్చారు.. అంతే కాదు.. ఒకవేళ జైలుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తే.. తీసుకెళ్లేది పోలీసులే.. వారు నా నియంత్రణలో ఉండి పనిచేస్తారు అంటూ ఆయన చేసేన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిపోయాయి.

-Advertisement-సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు.. కోర్టు ధిక్కారానికి భయపడొద్దు..!

Related Articles

Latest Articles