ట్రెంట్ చేసిన పని వైరల్…

టీ 20 ప్రపంచ కప్‌ 2021 ఫైనల్ లో న్యూజిలాండ్‌ ఓడిపోయిన విషయం తెలిసిందే. గత ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో పరాజయం పాలైనప్పటికీ.. కివీస్‌ మరోసారి అభిమానుల మనసులు గెలుచుకుంది. తాజాగా ఆ జట్టు స్టార్‌ బౌలర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ చేసిన పని సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. టీ 20 ప్రపంచ కప్‌ ముగించుకొని టీమిండియా పర్యటనకు దుబాయ్‌ నుంచి భారత్‌ కు బయలుదేరిన న్యూజిలాండ్‌ జట్టు ఎయిర్‌పోర్ట్‌ వరకు బస్‌ లో వచ్చింది. అయితే ఆ న్యూజిలాండ్‌ జట్టును తీసుకొచ్చిన బస్‌ డ్రైవర్‌ సంతోష్‌… బౌల్ట్‌ ను కలవాలని భావించాడు. దాంతో బౌల్ట్‌ ఆ బస్‌ డ్రైవర్‌తో సెల్ఫీ దిగి ఆ తర్వాత అతన్ని హగ్‌ కూడా చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇక ఈరోజు కివీస్ జట్టు భారత్ తో మొదటి టీ 20 మ్యాచ్ ఆడనున్న విషయం తెలిసిందే.

Related Articles

Latest Articles