యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య టాలీవుడ్ లో పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు. “వెంకీ మామ, మజిలీ” చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు చై. తాజాగా జిమ్ లో చైతన్య భారీ బరువులు మోస్తూ కష్టపడుతున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. తన నెక్స్ట్ మూవీ మేకోవర్, సరికొత్త ట్రాన్స్ఫార్మేషన్ లుక్ కోసమే ఇలా చెమటలు చిందిస్తున్నాడు. బీస్ట్ మోడ్ లో భారీ వర్కౌట్లు చేస్తున్న చై నెక్స్ట్ మూవీలో ఎలా కన్పించబోతున్నాడో అనే ఆసక్తిని రేకెత్తిస్తోంది ఈ వీడియో.
Read Also : నాని రిస్క్ చేయనంటున్నాడా ?
ప్రస్తుతం ఈ మిస్టర్ కూల్ నటించిన “లవ్ స్టోరీ, థాంక్యూ” చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన “లవ్ స్టోరీ” ఎప్పుడో విడుదల కావాల్సింది. కానీ కరోనా వల్ల ఆగిపోయింది. త్వరలోనే మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఇక “థాంక్యూ” చిత్రం ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘థాంక్యూ’ను దిల్ రాజు నిర్మిస్తుండగా… చైతూ సరసన రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాల తరువాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ “బంగార్రాజు”లో నాగ చైతన్య నటించనున్నారు. అయితే ఈ చై ట్రై చేస్తున్న సరికొత్త లుక్ దీనికోసమేనా కాదా అన్నది తెలియాల్సి ఉంది.
A post shared by NagaChaithanya ? (@chay_chaithanya)