గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ‘మా’ వివాదం రోజురోజుకు తీవ్రమవుతోంది. పోటీదారులు ఒకరినొకరు పరోక్షంగా విమర్శించుకుంటున్నారు. అయితే ఈ వ్యవహారాన్ని నిశితంగా గమనిస్తున్న వారికి వీరి వ్యాఖ్యలు తప్పుడు సంకేతాలను పంపిస్తున్నట్టు అవుతోంది. “మా” ఎన్నికల విషయమై గందరగోళ పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో పరిస్థితులకు చక్కదిద్దడానికి రంగంలోకి కృష్ణంరాజు దిగుతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే కృష్ణంరాజు ప్రస్తుత కౌన్సిల్‌తో పాటు రాబోయే ఎన్నికల విషయమై పోటీదారులతో సమావేశమవుతారు.
Read Also : పోటీ ఆ ఇద్దరి మధ్యే… సినిమానే మారింది!
ప్రస్తుత అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ సరిగ్గా లేదని, ఇటీవల వివాదాల వెనుక ఇదే కారణమని ‘మా’ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కృష్ణంరాజుకు లేఖ రాసింది. దీనిని పరిగణనలోకి తీసుకుని కృష్ణరాజు ‘మా’ సభ్యులతో సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇక మా ఎన్నికలు సెప్టెంబర్ నెలలో జరుగుతాయి. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుంది. ఇక పోటీదారుల విషయానికొస్తే… విష్ణు, ప్రకాష్ రాజ్ మధ్య “మా” అధ్యక్ష పదవికి గట్టి పోటీ నెలకొంది. వీరిద్దరిలో ఒకరు రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తారు.