వ్యభిచార గృహానికి వెళ్లాలంటే విటులు భయపడిపోతుంటారు. ఎక్కడ పోలీసులు రైడ్ చేస్తారో..? ఎక్కడ మీడియా తమ ఫోటోలను టీవీలో పదే పడే చూపిస్తూ పరువు తీస్తుందో..? ఇంట్లోవారికి తెలిసి గొడవలు అవుతాయో అని ఆందోళన చెందుతూ ఉంటారు. అయితే ఇకనుంచి ఆ భయం అక్కర్లేదు. పోలీస్ రైడ్ లో విటులు దొరికినా పోలీసులు అరెస్ట్ చేయరు. ఎందుకంటే.. పోలీస్ రైడ్ లో దొరికిన విటులు నేరస్తులు కాదని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇకపై విటులను కస్టమర్‌గా చూడాలే తప్ప, నేరస్తుడిగా చూడకూడదని హైకోర్టు తేల్చి చెప్పడం గమనార్హం.
ఇక ఈ కేసు వివరాల్లోకి వెళితే.. గుంటూరుకు చెందిన ఒక వ్యక్తిని పోలీసులు వ్యభిచార గృహంలో పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఇక ఈ కేసు 2020 లో మొదలైన ఈ కేసు పూర్వాపరాలను పరిశీలించిన హైకోర్టు తాజాగా సంచలన తీర్పునిచ్చింది. విటుడు కేవలం కస్టమర్ మాత్రమే అని, అతడిని విచారించే హక్కు ఎవరికి లేదని న్యాయమూర్తి డి.రమేశ్ తీర్పునిచ్చారు. ” వ్యభిచారం చేసేవారి మీద, ఆ వ్యభిచారం చేయడానికి ఇల్లు అద్దెకు ఇచ్చినవారిపై కేసు నమోదు చేయవచ్చు, వారిని విచారించవచ్చు. కానీ, డబ్బు చెల్లించి వారివద్దకు వెళ్లేవారు కేవలం కస్టమర్లు మాత్రమే. వారిని నేరస్తులుగా చూడడం తప్పు. ఇకనుంచి విటులను వ్యభిచారం కేసులో అరెస్ట్ చేయడం ఉండదు. వ్యభిచార గృహానికి వెళ్లిన కస్టమర్‌పై నమోదైన కేసును ఇదే కోర్టు గతంలో కొట్టివేసింది. అదే విధంగా ఈ కేసును కూడా కొట్టివేస్తున్నాం”. ఇకపై విటులపై కేసులు, విచారణ జరపకూడదని పోలీసులకు తెలిపారు. అయితే ఈ తీర్పు పై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి తీర్పు ఇస్తే వ్యభిచార గృహాలు ఎక్కువైపోతాయని, కుటుంబాల మధ్య సఖ్యత ఉండదని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ తీర్పు సంచలనంగా మారింది.