పాక్‌లో ఘోర రైలు ప్ర‌మాదం…30 మంది మృతి…

పాకిస్తాన్‌లో ఘోర రైలు ప్ర‌మాదం జరిగింది.  ద‌క్షిణ పాకిస్తాన్‌లోని రెతి-ద‌హ‌ర్కి స్టేష‌న్ల మ‌ద్య రెండు రైళ్లు ఢీకొన‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగింది.  ఈ ప్ర‌మాదంలో 30 మంది మృతి చెందారు.  అనేక‌మందికి గాయాలయ్యాయి.  లాహోర్ వైపు వెళ్తున్న స‌య్య‌ద్ ఎక్స్‌ప్రెస్‌, క‌రాచీ నుంచి స‌ర్గోదా వైపు వెళ్తున్న మిల్ల‌త్ ఎక్స్‌ప్రెస్‌లు ఢీకొన‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగింది.  మిల్ల‌త్ ఎక్స్‌ప్రెస్ ప‌ట్టాలు త‌ప్ప‌డం, స‌య్య‌ద్ ఎక్స్‌ప్రెస్ ఢీకొన‌డంతో ఈ పెను ప్ర‌మాదం జ‌రిగింది.  8 భోగీలు ప‌ట్టాలు త‌ప్పాయ‌ని, ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో రెండు రైళ్ల‌లో వెయ్యిమంది ప్ర‌యాణికులు ఉన్నార‌ని అధికారులు చెబుతున్నారు.  భోగీల మ‌ద్య‌లో ఇంకా అనేక‌మంది చిక్కుకున్నార‌ని, మ‌ర‌ణాల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంద‌ని అధికారులు చెబుతున్నారు.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-