మొబైల్‌ యూజర్లకు ట్రాయ్‌ గుడ్‌న్యూస్..!

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా గుడ్‌న్యూస్‌ చెబుతోంది… మొబైల్‌ యూజర్లకు.. అన్‌స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా సందేశాలను ఫ్రీగా అందించే ప్రతిపాదన తన ముందు ఉన్నట్టుగా చెబుతోంది. అది అమలైతే ఈ సేవలను ఉచితంగా పొందే అవకాశం దక్కనుంది. ఇంటర్నెట్ యాక్సెస్ లేని ఫీచర్ ఫోన్లతో పాటుగా, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సేవల కోసం వాడే యూఎస్‌ఎస్‌డీ సందేశాలను కూడా పూర్తిగా ఫ్రీగా అందించే ప్రతిపాదనను టెలికాం ఆపరేటర్లను ట్రాయ్‌ కోరింది. ప్రస్తుతం ఆయా టెలికం ఆపరేటర్లు గరిష్టంగా రూ. 1.50 నుంచి 50 పైసల మేర ఛార్జీలను వసూలు చేస్తున్నాయి. ట్రాయ్‌ ప్రతిపాదనలకు టెలికం ఆపరేటర్లు గ్రీన్‌ సిగ్నల్ ఇస్తే.. మొబైల్‌ యూజర్లకు ఆ భారం తప్పనుంది.

Read Also: వ్యాక్సినేషన్‌పై హరీష్‌రావు డెడ్‌లైన్..!

కాగా, డిజిటలైజేషన్‌ వైపు వేగంగా అడుగులు పడుతోన్న ఈ తరుణంలో డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించేందుకుగాను ఆర్బీఐ చేసిన సూచనల మేరకు నవంబర్ 24న జరిగిన టెలికామ్‌టాక్‌లో మొబైల్‌ యూజర్లందరికీ USSD సందేశాలను ఉచితంగా అందించాలనే ప్రతిపాదనను ట్రాయ్‌ పలు టెలికాం ఆపరేటర్ల ముందు పెట్టింది.. జీఎస్‌ఎమ్‌ సెల్‌ఫోన్ల సర్వీస్ ప్రొవైడర్ కంప్యూటర్‌లతో టెక్స్ట్ సందేశాల ద్వారా కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగించే ప్రోటోకాల్‌నే USSD అంటారు.. మన మొబైల్‌లో బ్యాలెన్స్‌ ఎంత ఉందో తెలుసుకోవడానికి వాడే నంబర్‌. వివిధ రకాల సర్వీసులకోసం ఆయా టెలికం సంస్థలు యూఎస్‌ఎస్‌డీ నంబర్స్‌ యూజర్లకు అందుబాటులో ఉంటాయి. అయితే, వీటికి ఇప్పటి వరకు ఛార్జీలను వసూలు చేస్తూ వస్తున్నాయి టెలికం సంస్థలు.. ఇప్పుడు ట్రాయ్ ప్రతిపాదనలకు వారు పంచ జెండా ఊపితే మాత్రం.. మొబైల్‌ యూజర్లకు కాస్త ఉపశమనం కలగనుంది.

Related Articles

Latest Articles