ట్రాఫిక్ ఉల్లంఘనులు.. నెంబర్ ప్లేట్లకి మాస్కులు

హైదరాబాద్‌లో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతోంది. చాలామంది హెల్మెట్లు వున్నా పెట్టుకోకుండా ప్రయాణాలు చేస్తుంటారు. తాజాగా కోవిడ్ మహమ్మారి వేళ హెల్మెట్ పెట్టుకోకుండా, ట్రాఫిక్ పోలీసులకు దొరకకుండా నానా ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్‌ ట్రాఫిక్ పోలీసులు ఇలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు.

సోషల్ మీడియా వేదికగా ట్రాఫిక్ పోలీసులు అలాంటి ఘనుల ఫోటోలను షేర్ చేస్తున్నారు. హెల్మెట్ లేకపోవడమే కాకుండా మాస్కులు లేకుండా యథేచ్ఛగా నగర రోడ్లపై తిరిగేస్తున్నారు. వైద్య శాఖ అధికారులు ఒకవైపు ఒమిక్రాన్ వేరియంట్ గురించి హెచ్చరిస్తూనే వున్నారు. అయినా వారిలో మార్పులు కనిపించడంలేదు. కరోనా మహమ్మారి వేళ తమ ముఖాలకు పెట్టుకోవాల్సిన మాస్కులు బైక్‌లు, స్కూటర్ల నెంబర్ ప్లేట్లపై అతికించి చట్టానికి దొరకకుండా తప్పించుకుంటున్నారు.

ఇక్కడ నెంబర్ ప్లేట్లపై ఎలాంటి మాస్కులు అంటించారో చూడండి. ఇలాంటి వారిపై ఏవిధమయిన చర్యలు తీసుకోవాలో చెప్పాలంటూ నెటిజన్లను ప్రశ్నించారు ట్రాఫిక్ పోలీసులు. ఇలాంటి వారిని శిక్షించడానికి సరైన ఐపీసీ సెక్షన్లు వాడాలని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. వీరిని న్యూ వేరియంట్ పేషెంట్లని పోలీసులు చమత్కరిస్తున్నారు.

వీళ్ళు చాలా స్మార్ట్ అంటున్న పోలీసులు

ఇలాంటి వారిపై భారీగా జరిమానాలు విధించాలని నెటిజన్లు కోరుతున్నారు. సీసీ టీవీ కెమేరాల ద్వారా వారి భరతం పట్టాలంటున్నారు. ”మీ ముఖానికి మాస్కు వుంటే క్వారంటైన్ నుంచి తప్పించుకోవచ్చు. కానీ మీ వెహికల్ నెంబర్ ప్లేట్ మీద మాత్రం మాస్కులేసి మాయ చేస్తే మాత్రం మీ వెహికల్ క్వారంటైన్ (జైలు)కి వెళ్ళడం గ్యారంటీ అంటున్నారు పోలీసులు. ఇలాంటి వారిపట్ల ప్రత్యేక చర్యలు చేపడతామంటున్నారు.

ప్రత్యేక పెట్రోలింగ్ వాహనాలు ఏర్పాటుచేసి ఇలాంటివారిని పట్టుకోవాలంటున్నారు. కొంతమంది బ్లాక్ టేప్‌లు అంటించి రిజిస్ట్రేషన్ నెంబర్లు కనిపించకుండా చేస్తున్నారు. ఇలాంటివారు ట్రాఫిక్ సిగ్నళ్ళ దగ్గర కనిపించిన వెంటనే జరిమానాలు వేయడం, వెహికల్ సీజ్ చేయడం చేస్తామంటున్నారు. పోలీసుల దగ్గర అందుబాటులోకి వచ్చిన సీసీ కెమేరాలు, బాడీ వోర్న్ కెమేరాల ద్వారా వీరి భరతం పట్టాలని నిర్ణయించారు.

Related Articles

Latest Articles