సంక్రాంతి ఎఫెక్ట్‌ : బోసిపోయిన భాగ్యనగరం..

నిశీది వేళలో సైతం నిద్రించని భాగ్యనగరం ఇప్పడు బోసిపోయింది. సంక్రాంతి పండుగ వేళ.. పట్నంవాసులు పల్లెలకు పరుగులు తీశారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంతవరకు మహానగరంలో ఉరుకుల పరుగుల జీవితాన్ని గడిపి.. సంక్రాంతి పండుగకు సొంతూళ్లో బంధుమిత్రులతో గడిపేందుకు ప్రజలు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ ప్రధాన రహదారులు వెలవెలబోతున్నాయి. ఎప్పడూ రద్దీగా ఉండే రోడ్లన్నీ నిర్మానుష్యంగా తయారయ్యాయి.

అటు ఏపీకి చెందిన వారు ఆంధ్రాకు పయనమైతే.. ఇటు తెలంగాణలోని వారి సైతం తమ ఊర్లకు వెళ్లి పండుగను ఆనందోత్సహాలతో జరుపుకుంటున్నారు. తెలుగువారి ముఖ్యమైన పండుగల్లో సంక్రాంతికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ పండుగ మూడు రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహించుకుంటారు. ఆరుగాలం కష్టపడిన రైతన్న కష్టం ఇంటికి వచ్చే రోజే సంక్రాంతిగా కూడా అందరూ చెప్పుకుంటారు. చిన్నాపెద్దా తేడా లేకుండా గాలిపటాలు ఎగురవేసి ఉత్సాహంగా గడుపుతారు.

Related Articles

Latest Articles