భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ కు టీపీసీసీ నేతల సూచనలు…

ప్రస్తుతం తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. అయితే తుఫాన్, భారీ వర్షాల వరదల నష్టాల అంచనాలకు నియోజక వర్గాలకు ఐఏఎస్ అధికారులను పంపించండి అని ముఖ్యమంత్రి కేసీఆర్ కు టీపీసీసీ, సీఎల్పీ నేతలు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క లు సూచించారు. రాష్ట్రంలో భారీ వర్షాలతో పల్లెలు పట్టణాలు, నగరాలు అతులాకుతలం అవుతున్నాయి. రాష్ట్రంలో పంటలు, ఇళ్ళు, రోడ్లు, చెరువులు, కాలువలు నష్టాలకు గురవుతున్నాయి. భారీ వర్షాలకు వరదల్లో కొట్టుకుపోయి, ఇళ్లు కూలిపోయి ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి.రెండు, మూడు రోజులు శాసనసభ వాయిదా వేసి ఐఏఎస్ అధికారులను 119 నియోజకవర్గాలకు పంపించి క్షేత్రస్థాయిలో లోతుగా నష్టాల అంచనాలను తయారు చేయించాలి అని తెలిపారు. అన్ని రకాల నష్టాలను అంచనాలు వేసి నివేదికలు తయారు చేసి అసెంబ్లీలో చర్చించాలి. వరదల నష్టాలను పూరించేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకొని ఆదుకోవాలి. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు వరద ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు అండగా ఉండాలి. అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలి అని పేర్కొన్నారు.

-Advertisement-భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ కు టీపీసీసీ నేతల సూచనలు...

Related Articles

Latest Articles