30 లక్షల సభ్యత్వం లక్ష్యం.. రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న సభ్యులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తూ న్యూ ఇండియా అస్యూరెన్సు కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. సభ్యత్వం తీస్కున్న కార్యకర్తలు ప్రమాదంలో మరణం సంభవిస్తే 2 లక్షల రూపాయల పరిహారం అందేలా, ప్రమాదం జరిగి ఏదైనా శరీర అవయవాలు దెబ్బతింటే ప్రమాదం తీవ్రతను బట్టి పరిహారం అందుతుంది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి, పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ హాజరయ్యారు.

దమ్ముంటే కేసీఆర్‌ని టచ్ చేయండి.. మంత్రి సవాల్

30 లక్షల సభ్యత్వం లక్ష్యం పూర్తిచేసి తీరతాం అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తొలుత జనవరి 26 వరకు అనుకున్నాం. కరోనా వల్ల మరి కొంత గడువు కూడా పెంచుకున్నాం. ఇప్పటి వరకు 7 లక్షల సభ్యత్వాలు పూర్తయ్యాయి. మార్చి వరకు సభ్యత్వంకి గడువు ఉంది. ప్రతి బూత్ నుండి 100 మంది సభ్యత్వం నమోదు చేయాలి. సభ్యత్వం తీసుకున్నవారికి 2 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుంది.మండల స్థాయిలో 10 వేలు, అసెంబ్లీ స్థాయిలో 50 వేలు.. పార్లమెంట్ స్థాయిలో మూడున్నర లక్షల సభ్యత్వం చేయించినవారికి రాహుల్‌తో సన్మానం చేయిస్తామన్నారు రేవంత్ రెడ్డి.

Related Articles

Latest Articles