పాలమూరు సభలో రేవంత్ కీలక వ్యాఖ్యలు

పాలమూరు సభలో రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పాలమూరు నుంచి 14 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించి… ఈ రాష్ట్రం తలరాత మార్చే అవకాశం తనకు ఇవ్వాలని కోరారు. లక్షా 93 వేల ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం ఇవ్వాలని.. 4 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు ఇచ్చే అవకాశం ఇవ్వాలని అన్నారు. అలాగే, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసే అవకాశం ఇవ్వాలని కోరారు రేవంత్ రెడ్డి. మరోవైపు, పరాయి రాష్ట్రం ప్రాజెక్టులపై దృష్టిపెడితే.. ఇక్కడే ఏడేళ్లుగా ఎలాంటి ప్రాజెక్టులు నిర్మించకుండా ప్రభుత్వం నిద్రపోతోందని విమర్శించారు. టీఆర్ఎస్ నుంచి గువ్వలోడు, గుడ్లగూబ లోడు ఎమ్మెల్యే లుగా భూ కబ్జాదారులు, ఇసుక దండాలు చేసేటోళ్లు పాలమూరు పరువు తీస్తున్నారని హాట్‌ కామెంట్లు చేసిన రేవంత్‌.. పోతిరెడ్డిపాడుకు పొక్క పెట్టి కృష్ణ నీళ్లు దోచుకుపోతుంటే కడప జిల్లా ఇంచార్జి మంత్రిగా టీఆర్ఎస్ మంత్రిగా ఉన్నారని.. మంత్రి పదవికి ఆశపడి రాజశేఖర్ రెడ్డి వద్ద కాళ్లవద్ద పడి పడిగాపులు కాసిండ్రు అని విమర్శించారు.

తెలంగాణ పునర్నిర్మాణంలో పాలమూరు నుంచే మొదలు పెడతామని.. బంజారా హిల్స్ లో తన ఇల్లు అమ్మి ఇక్కడ నిర్వాసితులకు ఇండ్లు కట్టిస్తా అన్నారు.. కానీ, ఇప్పుడు పాలమూరులో సాగునీటి దోపిడీ జరుగుతుందన్నారు. ఇక్కడ పరిశ్రమలు రావడంలేదు.. మా పిల్లలకు ఉద్యోగాలు లేవు.. మా పిల్లలు ఇంకా వలసలు పోవాల్సిందేనా.. బొంబాయిలో కంపెనీలలో పనిచేయాల్సిందేనా..? అంటూ ఫైర్‌ అయ్యారు రేవంత్‌రెడ్డి.. మా పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే వరకు బడిత పూజ చేస్తామని హెచ్చరించిన ఆయన.. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు.. కేసీఆర్ తెలంగాణ రాగానే పూర్తిచేసి ఉంటే ఈ రోజు పక్క రాష్ట్రం వాళ్లు అవ్వి అక్రమ ప్రాజెక్టులు అనే వారు కాదు కదా? అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి నేను అధ్యక్షున్ని అయినా నేను పాలమూరు బిడ్డనే అన్నారు రేవంత్‌రెడ్డి.. ఇక్కడ అసెంబ్లీ, పార్లమెంట్ అన్ని సీట్లు గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.. పోలీస్ లకు హెచ్చరిక చేస్తున్న.. కాంగ్రెస్‌ కార్యకర్తలను వేధిస్తున్న వారిని వారి పేర్లు రాసి పెట్టుకుంటాం.. మేం అధికారంలోకి వచ్చాక.. .కేసీఆర్ ను పండపెట్టి తొక్కుతాం అటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

-Advertisement-పాలమూరు సభలో రేవంత్ కీలక వ్యాఖ్యలు

Related Articles

Latest Articles