కేసీఆర్ పాలనలో ప్రజలకు అన్యాయం.. కాంగ్రెస్ అధికారంలోకి రావాలె..

కేసీఆర్‌ పాలనలో తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని విమర్శించారు పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి… గాంధీ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గుజ్జుల మహేష్‌కు కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పీసీసీ చీఫ్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలకు అన్యాయమే జరుగుతుంది.. ఏదో చేస్తాడని రెండు సార్లు కేసీఆర్‌ను సీఎంను చేస్తే.. ఏమీ చేయకుండా కుటుంబ పాలన చేస్తున్నారంటూ మండిపడ్డారు.. కుటుంబ సభ్యులకు వందల ఎకరాల భూములు కట్టబెట్టారు.. ఆంధ్ర కాంట్రాక్టర్లకు టెండర్లు ఇచ్చిండు అంటూ కామెంట్‌ చేశారు.

నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వలేదు, గిరిజనులకు పోడు భూముల సమస్య పరిష్కరించలేదన్న రేవంత్‌రెడ్డి.. ఫీజురీఎంబర్స్ మెంట్స్, ఆరోగ్య శ్రీ లేనే లేదన్నారు.. తల్లిదండ్రులు ఉపాధి హామీ కూలికి పోయి పిల్లలను చదివిస్తే ఉద్యోగాలు రాలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. దళితులకు 3 ఎకరాలు రాలే, గిరిజనులకు 12శాతం రిజర్వేషన్ రాలె.. మహిళకు పావలా వడ్డీ రుణాలు రాలె, బడిపిల్లలకు పగటితొ బువ్వ కూడా బంద్ అయ్యిందన్నారు.. కానీ, కేసీఆర్ కుటుంబ సభ్యులకు తలొక్క ఫామ్‌హౌస్ వచ్చింది.. కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ రావులకు పదవులొచ్చాయంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ కోసం బలిదానం చేసుకున్న కుటుంబాలను ఏమి రాలె.. కనీసం వాళ్లని పట్టించుకున్న పాపానపోలేదన్న రేవంత్ రెడ్డి.. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కల సాకారం కావాలంటే.. రాష్ట్రంలో.. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని.. దానికోసం అంతా పనిచేయాలని పిలుపునిచ్చారు.

Related Articles

Latest Articles

-Advertisement-