ఇందిరాగాంధీ స్ఫూర్తితో గజ్వేల్‌లో దండోరా.. సర్వాధికారాలు గీతక్కకే..

ఇందిరా గాంధీ స్ఫూర్తితో గజ్వేల్‌లో దండోరా సభ నిర్వహిస్తామన్నారు పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి… గాంధీ భవన్‌లో జరిగిన పీపీసీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడిన ఆయన.. గజ్వేల్ సభకి సర్వాధికారాలు గీతక్క(గీతారెడ్డి)కే ఉంటాయని.. ప్రతీ గ్రామంలో దండు కట్టి… దండోరా మోగించాలన్నారు. ఇక, గజ్వేల్‌ సభతో అంతకం కాదన్నారు రేవంత్‌ రెడ్డి.. గజ్వేల్ కోటను కొల్ల గొడితేనె.. సోనియమ్మ రాజ్యం వస్తుందన్నారు.. కో-ఆర్డినేటర్‌లు కష్టపడండి.. కష్టపడిన వారికే పదవులు, గుర్తింపు వస్తాయన్నారు. గజ్వేల్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేయాలని సామాన్య కార్యకర్త ఆశ అన్నారు పీసీసీ చీఫ్‌.. ఇందిరా గాంధీని పార్లమెంట్‌కి పంపించిన గడ్డ మెదక్ జిల్లా అని గుర్తుచేసిన ఆయన.. ఇందిరాగాంధీ స్ఫూర్తితో… గజ్వేల్‌లో దండోరా సభ నిర్వహిస్తున్నామని.. లక్ష మందిని తరలించాలని పిలుపునిచ్చారు.. గజ్వేల్ చుట్టూ ఉన్న 32 మండలాల్లో మండలం నుండి 3 వేల మందిని తరలించాలన్నారు.. ప్రతి బూత్ నుండి 9 మందిని తరలించండి.. కేసీఆర్‌ అదృష్ట సంఖ్య 6ని తిరగకొట్టండి అన్నారు. 119 మంది కో-ఆర్డినేటర్‌లు.. ఒక్కో బండి సభకు వచ్చేలా చూడాలన్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-