టి.పీసీసీ ప్రకటన.. సీనియర్, అధికార ప్రతినిధుల నియామకం

ఏఐసీసీ తెలంగాణకు కొత్త పీసీసీ అధ్యక్షుడిని, కమిటీలను ప్రకటించిన తర్వాత.. పార్టీలో కొత్త ఊపువచ్చిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.. ఇక, టి.పీసీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది.. ఐదుగురు సీనియర్ అధికార ప్రతినిధులను, 8 మంది అధికార ప్రతినిధులను ఒక సమన్వయ కర్తను నియమించారు పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి.. ఈ మేరకు టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఒక ప్రకటన విడుదల చేశారు. అలాగే 10 మంది సీనియర్ ఉపాధ్యక్షులకు పార్లమెంట్ నియోజక వర్గాల వారీగా పని విభజన కూడా చేసింది పీసీసీ.

పీసీసీ ప్రకటించిన సీనియర్ అధికార ప్రతినిధులు సిరిసిల్ల రాజయ్య మాజీ ఎంపీ, బెల్లయ్య నాయక్ ఆదివాసీ కాంగ్రేస్ జాతీయ నాయకులు, అద్దంకి దయాకర్ సీనియర్ నాయకులు, హర్షవర్ధన్ రెడ్డి, జెడ్పీ ఫ్లోర్ లీడర్, నేరేళ్ల శారద, మహిళ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు ఉండగా.. అధికార ప్రతినిధులుగా 1. మానవతా రాయ్, 2. ఎండీ రియాజ్, 3. రవళి రెడ్డి, 4. కైలాష్ నేత, 5. రామచంద్రారెడ్డి, 6. కల్వ సుజాత, 7. సంకేపల్లి సుధీర్ రెడ్డి, 8. చారగొండ వెంకటేష్ ఉన్నారు.. ఇక, అయోధ్య రెడ్డి.. అధికార ప్రతినిధుల సమన్వయ కర్త.. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాగా నియమించారు.. మరోవైపు సీనియర్ ఉపాధ్యక్షుల పని విభజన.. పార్లమెంట్ నియోజక వర్గాల వారీగా పరిశీలిస్తే.. 1. సంబాని చంద్రశేఖర్ వరంగల్ మరియు భువనగిరి, 2. ఆర్.దామోదర్ రెడ్డి.. మెదక్ మరియు నిజామాబాద్, 3. మల్లు రవి.. మల్కాజిగిరి మరియు హైదరాబాద్, 4. సురేష్ కుమార్ షెట్కార్.. ఖమ్మం మరియు మెదక్, 5. వేం నరేందర్ రెడ్డి.. మహబూబ్ నగర్ మరియు చేవెళ్ల, 6. జి.నిరంజన్.. పెద్దపల్లి మరియు సికింద్రాబాద్, 7. కుమార్ రావ్.. ఖమ్మం మరియు నల్గొండ, 8. రమేష్ ముదిరాజ్.. నాగర్ కర్నూల్ మరియు జహీరాబాద్, 9. పొడెం వీరయ్య.. ఆదిలాబాద్, 10. జఫ్ఫార్ జవీద్.. అనుబంధ సంఘాల బాధ్యత అప్పగించింది. సీనియర్ ఉపాధ్యక్షులకు కేటాయించిన పార్లమెంట్ నియోజక వర్గాల బాధ్యతలను ఆయా నియోజక వర్గాల కార్య నిర్వాహక అధ్యక్షులతో సమన్వయం చేసుకోవాలని సూచించింది పీసీసీ.

Related Articles

Latest Articles

-Advertisement-