టాయ్ కార్, వాచ్ లో బంగారం తరలింపు

బంగారం, హెరాయిన్, గంజాయి.. అక్రమార్కులకు ఇవే పెద్ద ఆదాయ వనరులు. ఏ అవకాశాన్నీ వదలడం లేదు. స్మగ్లర్లు దొరికిన చిన్నవస్తువులోనైనా బంగారం దాచేసి తెచ్చేసుకుంటున్నారు. దొరికితే దొంగ.. దొరక్కపోతే దొర. అయితే, కస్టమ్స్ అధికారులు వీరి ఆటలు సాగనివ్వడం లేదు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో వరుసగా పట్టుబడుతోంది అక్రమ బంగారం.

READ ALSO గోల్డ్ స్మగ్లింగ్.. కేటుగాళ్ళ రూటే సెపరేటు

అక్రమార్కులు వివిధ మార్గాలను ఎంచుకుని బంగారాన్ని విదేశాల నుండి తరలించేందుకు ప్రయత్నించి అడ్డంగా ఆధికారులకు దొరికిపోతున్నారు. తాజాగా దుబాయ్ నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న ప్రయాణికుడు బంగారాన్ని తెచ్చుకోవడానికి వివిధ మార్గాలను ఎంచుకున్నాడు. డియోడరెంట్ బాటిల్స్, పోర్టబుల్ ఎలక్ట్రానిక్ స్కేల్, టాయ్ కార్, అలారం వాచ్ లో మొత్తం 320 గ్రాముల బంగారం దాచుకున్నాడు. వీటిని తరలిస్తుండగా అతని బ్యాగ్ చెకింగ్ చేసి పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. పట్టుబడ్డ బంగారం విలువ దాదాపు రూ 15.75 లక్షలు ఉంటుందని అంచనా వేశారు ఆధికారులు. బంగారం స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు నిందితుడిని విచారణ చేపట్టారు.

Related Articles

Latest Articles